BSNL Top Plan: రోజుకు కేవలం రూ. 6 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL Top Plan: రోజుకు కేవలం రూ. 6 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL Top Plan:బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం తక్కువ ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ఒకటి అందుబాటులో వుంది. ఈరోజు బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి లాభాలు పరిశీలించనున్నాము. ఎందుకంటే, ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ కేవలం రోజుకు రూ. 6 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

ఏమిటా BSNL Top Plan?

బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 2,399 రూపాయల\ప్రీపెయిడ్ ప్లాన్ ఈ లాభాలు అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏకంగా 395 రోజులు అన్ని లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 395 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 395 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం కూడా అందుతుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా కూడా లభిస్తుంది.

BSNL Top Plan

ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్ హార్డీ Games, ఛాలెంజర్ అరేనా గేమ్స్, Gameon ఆస్ట్రోటెల్ , Gameium, Lystn Podocast, Zing మ్యూజిక్ మరియు BSNL Tunes వంటి అదనపు 395 రోజులు పాటు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను రోజు వారీగా లెక్కిస్తే, రోజుకు కేవలం రూ. 6 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.

Also Read: వచ్చే వారం విడుదల కానున్న Upcoming Mobiles లిస్ట్ ఇదే.!

మరిన్ని బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo